అప్పుడే పుట్టిన పాపకు దంతాలు!

జోగులాంబ గద్వాల (ఆరోగ్యజ్యోతి): పిల్లలకు సామాన్యంగా పుట్టిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించారు డాక్టర్లు. జోగులాంబ గద్వాలలోని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి దవాఖానలో పురుడుపోసుకున్న మహిళకు ఈ దంతాలు కలిగిన పాప పుట్టింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.