ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి) : జిల్లా అదనపు డియంఎహ్ఓగా జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు లెప్రసీ నివారణ అధికారిగా డాక్టర్స్ శ్రీకాంత్ ను నియమించారు. డాక్టర్ శ్రీకాంత్ భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా, దండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా పనిచేశారు. ఏడాదిన్నరపాటు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా పని చేశారు ఇటీవల జిల్లా మరియు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కి జిల్లా అధికారిగా నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నాడు ఆయన బాధ్యతలు స్వీకరించారు సిబ్బంది మర్యాదపూర్వకంగా ఇస్తూ శాలువాతో సన్మానం చేశారు..ఎయిడ్స్ మరియు లెప్రసీ విభాగాల్లో పనితీరును ఆయన పరిశీలించారు .అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎయిడ్స్ టెస్ట్ చేయాలని సూచించారు .ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించడం వల్ల ప్రజలను చైతన్య వత్తులు చేయడం చేపడతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపియం మదుసూదన్ ,జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు బండారి కృష్ణ , వామన్ ,ధనుంజయ్, రమణాచారి, పూజ రఘునాథ్ ,శ్రీకాంత్, సతీష్, శేఖర్ , సుభాష్
తదితరులు పాల్గొన్నారు