- కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఆసిఫాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ బస్టాండ్లలో ఆరోగ్య సర్వేలు నిర్వహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొవిడ్-19పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు బస్సులలో వచ్చిన వారిని తప్పనిసరిగా పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈస్‌గాం, రాజంపేటలలో ర్యాండం టెస్ట్‌లు చేయిం చాలన్నారు. బెజ్జూర్‌లో ప్రతి ఆదివారం నిర్వహించే వారసంతను రద్దు చేయా లన్నారు. బావులు, ట్యాంకులలో క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్వో కదం సురేష్, ఆర్డీఓ సిడాం దత్తు, జిల్లా వైద్యాధికారి కుమరం బాలు, డీటీడీఓ డాక్టర్ ఎం.దిలీప్‌కుమార్, డీపీఓ రమేష్, సీఐ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.