కరోనాపై అప్రమత్తంగా ఉండండి

 





  • అధికారుల సమీక్షలో కుమ్రం భీం  ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

  • కొవిడ్‌-19పై సందేహాలుంటే 18005991200 నంబర్‌ను సంప్రదించాలని సూచన


ఆసిఫాబాద్‌(ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కరోనా  వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 52 బ్యాంకుల్లో స్ప్రే చేయించినట్లు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు 17 రోజుల పాటు తప్పని సరిగా ప్రత్యేక గదిలోనే ఉండాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలన్నారు. గోలేటిలోని క్వారంటైన్‌ కేంద్రంలో 34 మంది, వాంకిడిలో 24 మంది, కాగజ్‌నగర్‌లోని పోస్ట్‌మెట్రిక్‌ బాలికల పాఠశాల భవనంలో 19 మంది, అలాగే ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీలోని ఐసొలేషన్‌ కేంద్రంలో 10 మంది ఉన్నారని వెల్లడించారు. ప్రజలు కరోనా గురించి సమస్యలుంటే 18005991200 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జి ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి కదం సురేశ్‌ ఆర్డీవో దత్తు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డీటీడీవో దిలీప్‌, పీడీవో రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.