కరోనా తో కుటుంబ సభ్యులు మొత్తం బలి

రాంచీ : కరోనా వైరస్ మహమ్మారి తో కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. గతంలో చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు చూసి ఆందోళన చెందిన భారతదేశంలో కూడా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాంచీ లోని ఓ కుటుంబంలోని 89 ఏండ్ల తల్లికి కరోనా రావడంతో ఆ ఇంట్లోని వారందరూ 14 రోజుల్లో బలయ్యారు. ఇతర నగరాల్లో వేర్వేరుగా నివాసం ఉంటున్న కొడుకు, కూతురు మాత్రమే ప్రాణాలో బయటపడ్డారు. ఒకే ఇంటిలో ఐదు మంది కరోనా కాటుకు బలి కావడంతో ఆ ఇల్లు స్మశానంగా మారిపోయింది.