ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం అధ్యక్షులుగా డాక్టర్ సందీప్ కుమార్

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి); తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం నాడు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల అధికారులుగా ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి ,ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రాంతి,డాక్టర్ శ్రీకాంత్ ,డాక్టర్ పవన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నిర్వహించడం జరిగింది. నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం ఆదిలాబాద్ శాఖ కార్యచరణ ప్రణాళిక త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ అందర్నీ శాలువాతో సన్మానించడం జరిగింది. ఎన్నికైన సంఘాన్ని సన్మానించడం తోపాటు అభినందనలు తెలియజేశారు .



తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం అధ్యక్షులుగా డాక్టర్ సందీప్ కుమార్


 తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఒప్పంద వైద్యుల సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులుగా డాక్టర్ సందీప్ కుమార్ ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో శనివారం నాడు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మహేంద్రర్సహ అధ్యక్షుడుగా డాక్టర్ వినోద్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ శ్యాం, డాక్టర్ శాజియ,  కోశాధికారిగా డాక్టర్ హరీష్  డాక్టర్ సురేష్ కార్యదర్శిగా డాక్టర్ బీం రావ్ ,డాక్టర్ స్వామి లను  ఎన్నుకోవడం జరిగింది.