అరగంటలో ఫలితం- మొత్తం 90 కేంద్రాల్లో టెస్టులు




ఇక వేగంగా కరోనా నిర్ధారణ


మొత్తం 90 కేంద్రాల్లో టెస్టులు


లక్షణాలు, హైరిస్క్‌ వారికి ఉపశమనం


యాంటిజెన్‌ పరీక్షలతో నమూనా సేకరించిన 


అరగంటలోనే కరోనా ఫలితం తేలుతుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పీసీఆర్‌ పరీక్షల ద్వారా జాప్యం జరుగుతుండటంతో కొవిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.  మూడు జిల్లాల్లోని 90 కేంద్రాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నది. దీంతో నమూనాలు ఇచ్చిన అనుమానితులకు ఉపశమనం లభిస్తుంది. కొవిడ్‌ లక్షణాలు, హైరిస్క్‌ రోగులు, గర్భిణులకు మాత్రమే ఈ పరీక్షలు చేస్తారు.  కరోనా వైరస్‌తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు జరిపిన 30నిమిషాల్లోనే రిపోర్టులు వచ్చేలా చర్యలు చేపట్టింది. గ్రేటర్‌ వ్యాప్తంగా(జీహెచ్‌ఎంసీ, మేడ్చల్‌, రంగారెడ్డి) 90 కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.


 


లక్షణాలున్న వారికి, హైరిస్క్‌ కేసులకే పరీక్షలు


ఇన్‌ఫ్లుయంజా లైక్‌ ఇల్‌నెస్‌(ఐఎల్‌ఐ), సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌(సారి)తో పాటు గర్భిణులు, గుండె, కాలెయ, కిడ్నీ, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ తదితర హైరిస్క్‌ కేసులకు యాంటిజెన్‌ పద్ధతిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.


 ‘ఐఎల్‌ఐ’ అంటే జలుబు, దగ్గు, తుమ్ములు వంటి స్వల్ప లక్షణాలు గలవారు 


‘సారి’ అంటే ఆయాసం, శ్వాస సమస్య, తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు తదితర తీవ్రమైన లక్షణాలు గలవారు


సిటీబ్యూరో-నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను మరింత వేగవంతం చేసింది. ఫలితాలు అరగంటలోపే వెల్లడించే విధంగా చర్యలు చేపట్టింది. కేసుల పెరుగుదలతో ప్రస్తుతం ఫలితాలు రావడానికి మూడు నుంచి నాలుగురోజుల సమయం పడుతున్న నేపథ్యంలో కొవిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ పరిధిలో మొత్తం 90 కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజెన్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పీసీఆర్‌ పరీక్షల ద్వారా ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యం వల్ల లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగులు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చే వరకు నమూనాలు ఇచ్చిన అనుమానిత రోగుల్లో పట్టరాని టెన్షన్‌ నెలకొంటుంది. ఇది చాలామందిని మానసిక ఒత్తిడికి సైతం గురిచేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యాంటిజెన్‌ పరీక్షల ద్వారా కేవలం 30నిమిషాల్లోనే వైరస్‌ నిర్ధారణ జరుగడంతో రోగులకు వెంటనే చికిత్స అందించే వీలుంటుందని వైద్యాధికారులు తెలిపారు. 


గ్రేటర్‌ పరిధిలో 90 కేంద్రాలు


గ్రేటర్‌ పరిధిలో మొత్తం 90 కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 50పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని 20, మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 20 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 


హైదరాబాద్‌ జిల్లాలోని కేంద్రాలివే..


నాంపల్లి, పన్నీపురా, గోల్కొండ, కింగ్‌కోఠి, అమీర్‌పేట్‌, బార్కాస్‌, డబీర్‌పురా, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌, శ్రీరాంనగర్‌, సీతాఫల్‌మండి, లాలాపేట, జంగమ్మెట్‌, సురాజ్‌భాన్‌ యూహెచ్‌ఎన్‌సీల పరిధిలోని


ఈ కింది పీహెచ్‌సీలలో..


సయ్యద్‌నగర్‌, చింతల్‌బస్తీ , అఫ్జల్‌సాగర్‌, నిలోఫర్‌, ఆగాపురా, పురానాపూల్‌, పన్నీపురా, కార్వాన్‌-2, దూద్‌బౌలి, బేగంబజార్‌, కుమ్మర్‌వాడీ, గుడిమల్కాపూర్‌, కార్వాన్‌-1, గగన్‌మహల్‌, డీబీఆర్‌మిల్స్‌, బొగ్గులకుంట, ఇసామియాబజార్‌, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, బండ్లగూడ, మైసారం, పార్వతీనగర్‌, ఉప్పుగూడ, తీగలకుంట, జహనుమా, చార్మినార్‌, ఈది బజార్‌, అమన్‌నగర్‌, పన్‌జెషా-1, ఆజంపురా, డబీర్‌పురా, యాకుత్‌పురా-2, దారుల్‌షిఫా, మాదన్నపేట్‌, శాలివాహననగర్‌, మలక్‌పేట్‌, బాగ్‌అంబర్‌పేట్‌, భోలక్‌పూర్‌, హర్రాజ్‌పేట, తిలక్‌నగర్‌, బోరబండ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బోయిగూడ, చుట్టాల్‌బస్తీ, మహ్మద్‌గూడ, తుకారాంగేట్‌, అడ్డగుట్ట, గరీబ్‌నగర్‌, కంటోన్మెంట్‌ (బోయిన్‌పల్లి)


గాంధీ వైద్యులకు రుణపడి ఉంటాం


ప్రైవేటు దవాఖానలో తనకు సరైన వైద్యం అందలేదని గాంధీవైద్యులు అక్కున చేర్చుకుని ఆదుకున్నారని చాంద్రాయణగుట్ట వాసి మహ్మద్‌ ఖలీల్‌ తెలిపారు. ఖలీల్‌ అతడి తండ్రి వైరస్‌ బారిన పడి స్థానిక ప్రైవేటు దవాఖానలో చేరినా అక్కడ సరైన వైద్యం లభించలేదు. దీంతో పలువురి సూచన మేరకు గాంధీకి వెళ్లగా అక్కడ వారం రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. అక్కడి వైద్యుల ప్రత్యేక కృషితోనే ఇది సాధ్యమైందని ఖలీల్‌ సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.


రంగారెడ్డి జిల్లాలో..


సరూర్‌నగర్‌, బాలాపూర్‌, అబ్ధూల్లాపూర్‌మెట్‌, రంగనాయక్‌లకుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పర్‌పల్లి, రాయదుర్గం, నందివనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూరు, మొయినాబాద్‌, కొందుర్గు, ఆమనగల్లు, యాచారం, కొత్తూరు.


మేడ్చల్‌ జిల్లాలో..


మల్కాజిగిరి, పీర్జాదిగూడ, సూరారంకాలనీ, దుండిగల్‌, కుషాయిగూడ, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, ఉప్పల్‌, వీఆర్‌నగర్‌, అల్వాల్‌, బోడుప్పల్‌, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, మౌలాలి, వైబండ, నాగోల్‌, మల్లాపూర్‌, గాజులరామారం.