అమరావతి(ఆరోగ్యజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నానాటికి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా నిర్ధారణ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 8147 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మరో 49 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 933కు చేరుకుంది.తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది,కృష్ణాలో 9, కర్నూలులో 8, శ్రీకాకుళంలో 7, పశ్చిమ గోదావరిలో 5గురు కరోనాతో మృతి చెందారు. గుంటూరు, విశాఖలో ముగ్గురు చొప్పున,చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాకు బలయ్యారు. ఒక్కరోజే తూర్పుగోదావరి జిల్లాలో 1029 మంది, అనంతపురంలో 984, కర్నూలులో 914, పశ్చిమగోదావరిలో 807, గుంటూరులో 703, విశాఖలో 898, చిత్తూరుల 630 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 80,858 మందికి కరోనా సోకింది.