ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సం రక్షించడం వల్ల గ్రామాలు పట్టణాలు పచ్చదనంతో నిండి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యం ప్రజలకు అందుతుందని 22 వ వార్డు కార్పొరేటర్ లక్ష్మి అన్నారు. రంగ సాయి పేట లోని స్వశక్తి భవనంలో పూల మొక్కలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపెట్టిన హరితహారం కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇంటికి ఆరు ముక్కల చొప్పున నాటాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తున్న అన్నారు .ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంట్లో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆమె కోరారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మహిళా నాయకులు మాడిశెట్టి కవిత రమాదేవి కొండ శ్రీలత పథకం రాధిక రాధిక అమరావతి కనుగొంటి పద్మావతి మమత గౌతం రాజేందర్ గొల్లపల్లి కరుణ తదితరులు పాల్గొన్నారు.