కరోనాతో భర్త మరణం..కోర్టుకు ఎక్కిన భార్య..రూ. 6 లక్షల బిల్లు మాఫీ




Coroana Virus కారణంగా తన భర్త మరణించాడని, డెడ్ బాడీని ఇవ్వాలంటే…లక్షల డబ్బులు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడిస్తోందని తనకు న్యాయం చేయాలని భార్య కోర్టుకు ఎక్కింది. కోర్టు ఆమెకు న్యాయం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

కరోనా రోగుల పట్ల..మానవత్వంతో స్పందించాలని ప్రభుత్వం సూచిస్తున్నా..కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ అలా చూడడం లేదు. లక్షలకు లక్షలకు బిల్లులు వేస్తున్నాయనే విమర్శలున్నాయి.

Corona Virus కారణం చూపుతూ..కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయి. వందల రూపాయల మందులు ఇస్తూ..లక్షల రూపాయల వసూలు చేస్తున్నాయి.

ప్రభుత్వం నిర్ధారించిన ధరలు కాకుండా..లక్షలు బిల్లులు వేస్తున్నాయి. ఒకవేళ రోగి చనిపోతే…డెడ్ బాడీని ఇవ్వడానికి కండీషన్స్ పెడుతున్నాయి. మొత్తం బిల్లు చెల్లిస్తేనే..డెడ్ బాడీని అప్పచెబుతామంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం బయటపడింది. చనిపోయిన వ్యక్తి భార్య కోర్టు మెట్లు ఎక్కడంతో ఆసుపత్రి యాజమాన్యం దిగి వచ్చింది. రూ. 6 లక్షల బిల్లును మాఫి చేసింది.

 

మూసాపేటకు చెందిన మోహన్ బాబు…కరోనాతో 2020, జులై 14వ తేదీన Continental Hospital, Nanakramguda హాస్పిటల్ లో చేరాడు. చికిత్స ప్రారంభించకముందే…లక్షన్నర రూపాయలను డిపాజిట్ చేసుకుంది ఆసుపత్రి యాజమాన్యం. చికిత్స పొందుతూ మోహన్ బాబు చనిపోయాడు.

రూ. 6 లక్షల రూపాయలను ఇస్తే గాని డెడ్ బాడీని ఇవ్వమని ఆసుపత్రి యాజమాన్యం ఆ కుటుంబానికి వెల్లడించింది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న అతడి భార్య..కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండానే..పోలీసుల సమక్షంలో డెడ్ బాడీని అప్పచెప్పింది. రూ. 6 లక్షల బిల్లును మాఫి చేసింది. ఈ ఘటనపై Telangana High Court ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.