తెలంగాణాలో 3 లక్షలు దాటిన కరోనా పరీక్షలు





  • ఒక్కరోజే 1,281 మంది డిశ్చార్జి

  • రాష్ట్రంలో మొత్తం 76.5% మంది డిశ్చార్జి


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా పరీక్షలు మూడు లక్షలు దాటాయి బుధవారం ఒక్కరోజే 15,882 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 9.8 శాతం శాంపిళ్లకు మాత్రమే పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. బుధవారం ఒక్కరోజే 1,281 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 36 వేలు దాటింది. బాధితుల డిశ్చార్జి రేటు 76.5 శాతానికి చేరింది. బుధవారం 1,554 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 842 మందికి కరోనా సోకింది. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల 9 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య కేవలం 0.88 శాతమేనని అధికారులు తెలిపారు.  రంగారెడ్డిలో 132, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 96, కరీంనగర్‌లో 73, నల్లగొండలో 51, వరంగల్‌ అర్బన్‌లో 38, వరంగల్‌ రూరల్‌లో 36, నిజామాబాద్‌లో 28, మెదక్‌లో 25, సంగారెడ్డిలో 24, పెద్దపల్లిలో 23, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 22 చొప్పున, వనపర్తిలో 21, రాజన్న సిరిసిల్లలో 18, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లో 14 చొప్పున, మహబూబాబాద్‌లో 11, యాదాద్రి భువనగిరి, ములుగు, ఆదిలాబాద్‌లో 8 చొప్పున, జోగుళాంబ గద్వాలలో 5, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 3 చొప్పున, సిద్దిపేట, ఆసిఫాబాద్‌లో 2 చొప్పున, నిర్మల్‌, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున వెలుగుచూశాయి.


రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు






























వివరాలు      బుధవారం మొత్తం 
పాజిటివ్‌కేసులు  1,554 49,259 
డిశ్చార్జి అయినవారు     1,28137,666
మరణాలు   9  
చికిత్స పొందుతున్నవారు     - 11,155