2వ ఏఎన్ఎం  డిమాండ్ నెరవేర్చిన ప్రభుత్వం

-  ప్రభుత్వనికి  ధన్యవాదాలు


- 2వ ఏఎన్ఎం అసోసియేషన్ - తెలంగాణ' గౌరవ అధ్యక్షులు  భారత సుదర్శన్


హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): 'కొవిడ్ 19' (కరోనా వైరస్) పై తెలంగాణ రాష్ట్రంలో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులకు 'నిమ్స్ హాస్పిటల్'లో ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటెల రాజేందర్  ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వు విడుదలైంది. 'కొవిడ్ 19' కు చికిత్స చేస్తున్న వైద్యులకు 'నిమ్స్'లో చికిత్సను అందించాలని ఇటీవల డాక్టర్ల సంఘం ప్రతినిధులు కొందరు 'మంత్రి ఈటల'కు విజ్ఞప్తి చేశారు.స్పందించిన మంత్రి 'ఈటల'! 'కొవిడ్ 19'పై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న '2వ ఏఎన్ఎంలు' ఇతర ఆరోగ్య సిబ్బందికి కూడా ఉచిత వైద్యాన్ని అందించాలని మన '2వ ఏఎన్ఎం అసోసియేషన్ - తెలంగాణ' తరపున గౌరవ అధ్యక్షుడు 'భారత సుదర్శన్' మంత్రి 'ఈటల రాజేందర్' గారిని కోరడం జరిగింది. ఈ మేరకు పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల రాజేందర్ గారలకు మన డిమాండ్ ను తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించి, 'కొవిడ్ 19' మహమ్మారిపై వీరోచితంగా పోరాడుతున్న వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికీ హైదరాబాద్ లోని 'నిమ్స్ హాస్పిటల్'లో ఉచిత వైద్యాన్ని ప్రభుత్వమే అందించేట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు.మన డిమాండ్ ను పరిష్కరించిన మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారికి, వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ మరియు డైరెక్టర్లకు '2వ ఏఎన్ఎం అసోసియేషన్ - తెలంగాణ' గౌరవ అధ్యక్షులు  భారత సుదర్శన్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.