సమస్యలు పరిష్కరించండి

- రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి 







హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): గత నాల్గు నెలలుగా కరోనా వైరస్ సర్వే పేరుతో ఎఎన్ఎమ్ , ఆశా వర్కర్లను అధికారులు వేధింపులకు గురిచేస్తున్న తీరు పట్ల తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హేల్త్ ఎంప్లైస్ యూనియన్ - హేచ్ 1 రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి స్పందించారు. బాలపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది ఎదుర్కోంటున్న సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆశా వర్కర్లు రెగ్యూలర్ విధులను ప్రక్కన బెట్టి కరోనా వైరస్ సర్వేల పేరుతో తమను వేదింపులకు గురిచేస్తున్నారని ఆశా వర్కర్లు యూనియన్ దృష్టి కి తీసుకువచ్చారు. కనీసం మాస్క్ లు , శానిటైజర్లు , గౌజ్ లు (P. P.  కిట్లు) ఇవ్వకుండానే వైరస్ ప్రభావిత ప్రాంతాల్ల పనిచేపిస్తున్నారని ఆరోపించగా వైద్య సిబ్బంది ఎదుర్కోంటున్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకుపోతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి పిహేచ్ సీ ల్లో ఉన్న స్టాఫ్ ని రోటేషన్ పద్ధతిలో సిబ్బందికి డ్యూటి వెయ్యాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల విధులను ప్రక్కన పెట్టించి ప్రతిరోజు కరోనా పాజిటీవ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రైమరీ కాంటాక్ట్స్ , ఇంటింటి సర్వే పేరుతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. పి హేచ్ సీ అధికారుల అనాలోచిత చర్యలను ఎండగడతామని అన్నారు. కోన్నీ ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వైద్య సిబ్బంది పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించే తీరు ప్రభుత్వం దృష్టి కి తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఆశావర్కర్ల తో వెట్టిచాకిరీ చేపిస్తున్న,న్యాయమైన హక్కులు కోసం పోరాటం చేస్తామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు నిర్వీరామంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఓక నెల పారితోషికం 7500/- లను ఇన్సేంటీవ్ గా ఇవ్వాలని ప్రభుత్వాన్నీ కోరుతామని అన్నారు. 510 జి. ఓ. గురించి . నేషనల్ హెల్త్ మిషన్ లో మొత్తం 13000 మెంబెర్స్ పని చేస్తున్నారు 9000 మెంబెర్స్ వేతనం పెంచారు 510 జీ .ఓ లో డేట్ 05-09-2018 పెంచారు , 4000 మెంబెర్స్ కి వేతనం పెంచలేదు 510 జీ .ఓ. లో 4000 మెంబెర్ స్ కి వేతనం పెంచాలిని డిమాండ్ చేసినారు.