పీహెచ్‌సీల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు…15 నిమిషాల వ్యవధిలో ఫలితం



 











 












కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం కావడంతో ప్రజలకు సేవలు మరింత చేరువకానున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌, జిల్లా కేంద్రంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుకిట్లను సరఫరా చేసింది. వీటి ద్వారా కరోనా నిర్ధారణ ఫలితం 15 నిమిషాల వ్యవధిలో తేలనుంది.




















ఈ పరీక్షలు పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారికి, అనుమానిత లక్షణాలు గలవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే నిర్వహిస్తారు. పెద్దశంకరంపేట పీహెచ్‌సీలో బుధవారం అనుమానిత లక్షణాలు కలిగిన ఆరుగురికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.


పెద్దశంకరంపేట మండలానికి 25 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు రాగా, ఇప్పటికీ ఆరుగురికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారి పుష్పలత తెలిపారు. అనుమానిత లక్షణాలు కలిగిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ముక్కు నుంచి నమూనాలు సేకరించి 15 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడిస్తున్నారు.