హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో రోజురోజుకూ కరోనా విస్తరిస్తోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1410 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 కేసులు నమోదయ్యాయి. 331మంది వైరస్ బారి నుంచి కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏడుగురు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,946 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 18,192 మంది చికిత్స కోలుకొని డిశ్చార్జికాగా 12,423మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 331 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 1,40,755 శ్యాంపిళ్లను పరీక్షించగా ఇవాళ 5,954 మందికి పరీక్షలు నిర్వహించారు. గురువారం జీహెచ్‌సీ పరిధిలో 918 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డి జిల్లాలో 79, వరంగల్ అర్బన్ జిల్లాలో 34, కరీంనగర్‌లో 32 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 21, నిజామాబాద్ జిల్లాలో 18, సూర్యాపేట జిల్లాలో 10, మహబూబ్ నగర్ జిల్లాలో 8, మెదక్ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలో 5 చొప్పున, వరంగల్ రూరల్ జిల్లాలో 7, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాలో 2చొప్పున జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, సిద్దిపేట ఒక్కో కేసు చొప్పున కేసులు నమోదయ్యాయి.