'రాజన్న'కు ధన్యవాదాలు!

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ ఆడబిడ్డ రక్షణకై తక్షణమే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ టీం, 'నిమ్స్' అధికార యంత్రాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు.ప్రజల మనిషి 'రాజన్న' అని 2వ ఏఎన్ఎం అసోసియేషన్ - తెలంగాణ' గౌరవ అధ్యక్షులు  భారత సుదర్శన్అన్నారు.కొవిడ్ 19 ను తెలంగాణలో అరికట్టేందుకు ఎన్ని నిద్రలేని రాత్రిళ్లు గడిపాడో నాకు తెలుసు.  అనుకోని విపత్తులా వచ్చిన 'కరోనా' మన ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అయినా సమర్ధవంతంగా పనిచేస్తున్న 'రాజన్న' బృందం అభినందనీయులే. ఒక ఆడబిడ్డ ఆవేదనను అర్థం చేసుకునే తత్వం నరనరాన జీర్ణించుకున్న నేత 'రాజన్న'.మన ఆరోగ్య సైనికురాలు, జగిత్యాల జిల్లాకు చెందిన  '2వ ఏఎన్ఎం'ను 'నిమ్స్' (NIMS) అధికారులు చేర్చుకున్నారు. స్పందించిన శ్రేయోభిలాషులు,మానవతావాదులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.


 2వ ఏఎన్ఎం మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది ఆత్మీయులారా! కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మీరు అనవసర భయబ్రాంతులకు గురై సమస్యను జటిలం చేసుకోవద్దు. యంత్రాంగం సర్దుబాట్లను అర్ధం చేసుకోండి. ప్రభుత్వం, ప్రజలు మీవెన్నంటే ఉన్నారని మరువకండి. ధైర్యంగా పనిచేయండి! ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపండి!!