హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 762 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 171, మేడ్చల్ మల్కాజిగిరి 85, సంగారెడ్డి 36, నల్లగొండ 32, కామారెడ్డి 23, మెదక్ 22, ఖమ్మం 18, మంచిర్యాల 17, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సూర్యాపేట 14 చొప్పున, కరీంనగర్, నారాయణపేట 9 చొప్పున, వరంగల్ రూరల్, నిజామాబాద్ 8 చొప్పున, రాజన్న సిరిసిల్ల 7, మహబూబాబాద్, పెద్దపల్లి 6 చొప్పున, వరంగల్ అర్బన్ 5, సిద్దిపేట 4, జనగామ 3, నిర్మల్, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 1 కేసు చొప్పున నమోదయ్యాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,51,109 పరీక్షలు చేయగా, 32,224 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొత్తం 339 మంది మరణించారు. ఇప్పటివరకు చికిత్స అనంతరం మొత్తం 19,205 మంది డిశ్చార్జి కాగా, శుక్రవారం 1,013 మంది చికిత్స ద్వారా కోలుకొని ఇంటికి వెళ్లినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. కొవిడ్ చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 17,081 పడకలు ఉండగా, 1,618 మాత్రమే భర్తీ అయ్యాయి. 15,463 పడకలు ఖాళీగా ఉన్నట్టు వివరించింది.
మరణాల రేటు ఒక్క శాతమే
రాష్ట్రంలో మొత్తం 32,224 పాజిటివ్ కేసులు ఉండగా, డిశ్చార్జి, రికవరీలు కలుపుకొని 19,205 (60 శాతం) ఉన్నాయి. మరణాల రేటు ఒక్క శాతమే ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు 339 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్‌గా ఉండి సీరియస్‌గా ఉన్నవారికి నాణ్యమైన చికిత్స అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నది.
రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు
వివరాలు | శుక్రవారం | మొత్తం |
పాజిటివ్‌కేసులు | 1,278 | 32,224 |
డిశ్చార్జి అయినవారు | 1,013 | 19,205 |
మరణాలు | 8 | 339 |
చికిత్స పొందుతున్నవారు | - | 12,680 |