కరోనా మామూలు జలుబు లాంటిదే: ధైర్యం చెప్పిన వ్యాధి నుంచి కోలుకున్న100 ఏళ్ల బామ్మ

బళ్లారి: చిన్న పిల్లలకు, ముసలోళ్లకు కరోనా మహమ్మారి సోకితే అంత తొందరగా కోలుకోరని వైద్య నిపుణులు సూచిస్తుంటే. కర్నాటకలోని బళ్లారికి చెందిన 100 ఏళ్ల హాలమ్మ అనే బామ్మ మాత్రం కరోనా నుంచి కోలుకుని ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. అది మామూలు జలుబు లాంటిదే అని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా వ్యాధి నుంచి కోలుకుంటామని అన్నారు. “ డాక్టర్లు నాకు బాగా ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. నేను రెగ్యులర్‌‌గాతినే ఫుడ్‌తో పాటు యాపిల్‌ చూడా తింటున్నాను. ట్యాబెట్లు, ఇంజక్షన్లు ఇచ్చారు. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. కరోనా అనేది మామూలు జలుబు లాంటిదే ధైర్యంతో జయించవచ్చు” అని హాలమ్మ అన్నారు. ఆమెతో పాటు కొడుకు, కోడలు, మనవడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వాళ్లంతా ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుని నయం చేసుకున్నారు. బ్యాంక్‌ ఎంప్లాయ్‌ అయిన కొడుక్కి కరోనా రావడంతో ఆయన నుంచి హాలమ్మకు కూడా వచ్చిందని, జులై 16న పాజిటివ్‌ రాగా.. 22 కల్లా ఆమె వ్యాధి నుంచి కోలుకున్నారని అన్నారు.