హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,826కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా కరోనాతో కోలుకున్న1,661 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 39,327కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 9మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 447గా నమోదైంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 662 ఉన్నాయి. ఇప్పటి వరకు 3,22,326 మందికి టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.