హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి) : తెలంగాణలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇవాళ తొమ్మిది మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్‌లోనే 736 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం పాజిటవ్ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది.
రాష్ట్రంలో 12,135 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్ అయ్యారు. రంగారెడ్డి(125), మేడ్చల్(101), కరీంనగర్(24), సిరిసిల్ల(24), వరంగల్ అర్బన్(20), సంగారెడ్డి(13) జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.