నల్లగొండ(ఆరోగ్యజ్యోతి): కరోనా విజృంభిస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 25 మందికి పాజిటివ్ వచ్చింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో పది, మిర్యాలగూడలో నాలుగు, కోదాడలో నాలుగు, నకిరేకల్, పెద్దవూర, నార్కట్‌పల్లి, మునుగోడు, సూర్యాపేట, చింతలపాలెం, చిలుకూరులో ఒక్కొక్కటి నమోదయ్యాయి.