ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి







 - నల్ల రిబ్బన్లతో నిరసనలు

 - రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుభాష్


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):    వైద్య ఆరోగ్యశాఖలో వివిధ కేటగిరిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుభాష్ అన్నారు. బుధవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ ఆసుపత్రిలో రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కూడా లెక్క చేయకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాఖ కూడా కరోనపై పనిచేయడం లేదని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా  భయంకర మైన పరిస్థితుల్లో కూడా రోగులకు సేవలు అందిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు .జీవో నెంబర్ 14 ప్రకారం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు180 రోజుల ప్రసూతి సెలవు వేతనంతో కూడిన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే కాకుండా చాలా వరకు డిమాండ్ పెండింగ్లో ఉన్నాయని ఆ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల & పరిశుద్ద కార్మికులు పాల్గొన్నారు.