ముగ్గురికి కరోనా పాజిటివ్‌

క్వారంటైన్‌లో కార్మికులు, అధికారులు


మంచిర్యాల, (ఆరోగ్యజ్యోతి): జిల్లాలో మరో ముగ్గురు స్థానికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం 25 మంది నమూనాలను హైదరాబాద్‌కు పంపగా ముగ్గురికి పాజిటివ్‌, 22 మందికి నెగెటివ్‌ వచ్చింది. ఆది వారం నమోదైన పాజిటివ్‌లో ఒకరు బెల్లంపల్లిలోని బొగ్గుగని కార్మికుడు కాగా ఇద్దరు రామకృష్ణాపూర్‌కు చెందినవారు.  వలస కూలీలలో 36 మందికి రాగా వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు, స్థానికులు ఏడు, ఒకరు మహిళ మరణించగా జిల్లాలో మొత్తం 47 కేసులకు చేరింది. ప్రస్తుతం 2,478 మంది హోంక్వారంటైన్‌లో ఉండగా ఐసోలేషన్‌లో 17 మంది ఉన్నారు.