- వైద్యఅధికారిని డాక్టర్ నర్మద
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలోని ఇంద్రానగర్ లోని హమాలివాడలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నాడు డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారిని డాక్టర్ నర్మద మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దీనితోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద నీటి నిల్వ ఉండకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.వర్షాకాలం కావడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు .ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ,అతిసార వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంజయ్, సి ఓ అనిత, ఆరోగ్య కార్యకర్త పుష్ప తదితరులు పాల్గొన్నారు