ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 11.30 గంటలకు పట్టణంలోని ఆర్టి ఓ కార్యాలయం వెనుక గల భగత్ సింగ్ నగర్ కాలనీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ మైనారిటీ విభాగం, జిల్లా చైర్మన్ సాజిద్ ఖాన్ తెలిపినారు. నిత్యావసర సరుకుల తో పాటు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.