వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వరంగల్ పట్టణంలో కొవిడ్-19 కరోన సర్వేలో భాగంగా ఆశా కార్యకర్తలు ద్వారా 8 టీములుగా విభజించి సర్వేకు పంపించడం జరిగిందని చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎస్ రవీందర్ తెలిపారు .ఖమ్మం రోడ్డు, సాయి బాబా టెంపుల్, రుద్రమాంబ నగర్, పిఎం నగర్ తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారికి త్యేకంగా సర్వే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఇంటింటికి సర్వే నిర్వహించడం ద్వారా ఆ ఇంటిలో నివసించే వారికి దగ్గు జలుబు జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రయుము లో సూపెర్వైసోర్ డీ. మోహనరావు , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , మలేరియా ఆఫీసర్ తేజవత్ రవీందర్, ఏ .ఎన్ .ఎం .లు. ఉమా , నాగలక్ష్మి , ఉప్పలమ్మ , శ్రీలతా , ప్రేమ లతా మరియు ఆశ వర్కర్స్ అనూష ,కవిత, సుమలత ,స్వాతి, చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు .