- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి
వరంగల్,(ఆరోగ్యజ్యోతి): కరోన తో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని జర్నలిస్ట్ చేసిన కృషి ఎంతో కీలకమైందని జర్నలిస్టుల సేవలు మరువలేనివని వరంగల్ అర్బన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు.వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నాడు జర్నలిస్టులకు కరోనా టెస్టుల ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ లో ప్రతిరోజు 25 మంది జర్నలిస్టులకు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జర్నలిస్టు వార్తా కవరేజ్ కొరకు వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సూచించారు. జాగ్రత్త తీసుకోవడం వల్ల కరోన దరిచేరదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి ,కార్యదర్శి పేరుమల్ల వెంకట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఆర్ లెలిన్,రాష్ట్ర నాయకులు గడిపెల్లి మధు,జిల్లా కార్యదర్శి నాయకపు సుభాష్,డిప్యూటి డియంఎహ్ఓ డాక్టర్ యాకుబ్ పాషా, అడిషనల్ డియంఎహ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు డాక్టర్ సుభాష్ జిల్లా అధికారి అశోక్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు సుదీర్, రంజిత్, రమేష్, సుధాకర్, కట్ట రాజు శ్రీకాంత్, అశోక్ ,బుడిగె శ్రీను, అంజి రెడ్డి ,రవీందర్ రెడ్డి తో పాటు వివిధ పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన తదితరులు పాల్గొన్నారు