- జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కెసిఆర్ కిట్ ప్రైస్ ప్రత్యేక దృష్టి సాధించాలని అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందికి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ సూచించారు.శుక్రవారం నాడు తన చాంబర్లో ఆదిలాబాద్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లు లో పనిచేస్తున్న వైద్యాధికారులకు, సూపర్వైజర్లకు, ఆరోగ్య కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని తెలిపారు. గర్భవతులను గర్భవతుల పేర్లు నమోదు చేసిన వెంటనే వారిని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.ఆన్లైన్లో నమోదు చేయనట్లయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హేచారించారు. ఆసుపత్రిలో ప్రసూతి అయినట్లయితే మాతా శిశు పూర్తి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రభుత్వం వారికి కెసిఆర్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. దీనితో పాటు ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం ద్వారా డబ్బులు రావడం జరుగుతుందన్నారు.