ఒకే కాన్పులో ముగ్గురి జననం


 




నారాయణపేట  : ఒక కాన్పులో ముగ్గురు జన్మించడం అరుదు. ఇలాంటి అరుదైన సంఘటన నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో ఆదివారం జరిగింది. ఈ దవాఖానలో వార్డు బాయ్‌గా పని చేస్తున్న రాజలింగం భార్య అనంతమ్మకు పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో ఆస్పత్రిలో చేర్చాడు. సాధారణ ప్రసవం కాగా ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడబిడ్డ జన్మించారు.