షబ్బీర్ అహ్మద్ సేవలు మరువలేనివి

 


హైదరాబాద్ , (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి షబ్బీర్ అహ్మద్ అని ఆయన సేవలు మరువలేనివని వర్కింగ్ ప్రెసిడెంట్ రాబట్టు బ్రూ స్లీ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర రవి అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లోని డైరెక్టర్ అఫ్ హెల్త్ కార్యాలయంలో షబ్బీర్ అహ్మద్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. అనంతరం అయన  చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గారు ప్రతి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అయన ఎనలేని  సేవలందించారని ఈ సందర్భంగా తెలిపారు .తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులకు న్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బి .రమేష్ ,  తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జే ఎ సి .కన్వినర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,కో కన్వీనర్ డాక్టర్ నరహరి , డాక్టర్ రఘు , డాక్టర్ వసంత ,  కో కన్నీరు.ప్రసన్న , అసోసియేట్ ప్రెసిడెంట్ అంతులు అజీమ్ , సెంట్రల్ యూనియన్ ముఖ్య సలహాదారులు .ఎం .మనోహార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బైరపాక శ్రీనివాస్ , మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  అరుణ, స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ వినిత్ , ఆరవ జోన్  ప్రెసిడెంట్ శ్రీనివాస్ , వైద్య విధాన పరిషత్ విభాగం  రాష్ట్ర కో కన్వీనర్ పి. లక్ష్మయ్య , డిఎంఈ.విభాగం చైర్మన్ ఆరపెల్లి కమలాకర్ ,ఆర్ఎన్టిసిపి.రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్ కుమార్ , హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హనుమంతు , ఆర్ఎన్టిసిపి రహీం ,  మల్లికార్జున్ ,వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు వర్మేంద్ర  ప్రసాద్ , షబ్బిర్ హమ్మద్ పెద్ద కుమారుడు సాజిత్ , యాదమ్మ  నేషనల్ హెల్త్ మిషన్ కో చైర్మన్ రామ రాజేష్ కన్నా , మౌనిక తదితరులు పాల్గొన్నారు.