ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు బేతరమేష్ అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్త కవరేజ్ కొరకు వెళ్లిన జర్నలిస్టులకు కరుణ వైరస్ సోకే ప్రమాదం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక వైద్య పరీక్షలు చేయాలన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో 68 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆదిలాబాద్ రిమ్స్ లో జర్నలిస్టులందరికీ వైద్య పరీక్షలు చేయించాలని కలెక్టర్ కోరారు. అలాగే అందరికీ అక్రిడేషన్ అందించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు అలాగే వీలైనంత తొందరలో అక్రిడేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్హులైన అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రదన కార్యదర్శి ఎల్ రాజు. వైస్ ప్రసిడెంట్ అన్వర్,దేవేందర్,సంతోష్,ఆంజనేయులు,పవన్ తదితరులు పాల్గొన్నారు.