క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలి

- జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్


ఇంద్రవెల్లి, (ఆరోగ్యజ్యోతి): క్రమం తప్పకుండ పిల్లలకు గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం నాడు ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధనోర, దేవాపూర్ గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు.వ్యాక్సిన్ కు కోల్డ్ చైన్ సిస్టం తప్పకుండా పాటించాలని సూచించారు. గర్భిణీ మహిళలకు తప్పనిసరిగా రిజిస్తేసన్ చేయాలని దీని ద్వారా ప్రసూతి సమయంలో వారికి కెసిఆర్ కి తో పాటు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం వస్తుందన్నారు. ఆస్పత్రిలో ప్రసూతి అయినట్లయితే తల్లి బిడ్డ క్షేమం గా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వర్షాకాలం కావడం వల్ల ఆశా కార్యకర్తలు వద్ద అవసరమయ్యే మందులను ఉంచాలని ఆయన సూచించారు. కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని ఆయన తెలిపారు.