పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి


 

వరంగల్,(ఆరోగ్యజ్యోతి):  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి  స్పెషల్ లిస్ట్  వైద్య అధికారిని  డాక్టర్  శిరీష, న్యూ పెద్దమ్మగడ్డ యూ. పీ. ఎచ్. సి మెడికల్ .ఆఫీసర్ డాక్టర్ సుచరిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొన్నట్లయితే ఈగలు దోమలు లేకుండా ఉంటాయని తెలిపారు .ఈగలు దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే ప్రజలు వ్యాధుల బారిన పడరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కరోనా రాకుండా ఉండేందుకు వ్యక్తిగత నియమాలను పాటించాలని తెలిపారు .ముఖ్యంగా మాస్కులు ధరించాలని,  సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఇలా చేయడం వల్లకరోన  వ్యాధి రాకుండా ఉంటుందన్నారు.