కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో రక్తదానం

 

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం నాడు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .కాలనీ వాసులకు నిత్యావసర సరుకుల తో పాటు చిన్నారులకు పండ్లు  చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు సాజీద్ ఖాన్    కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  గండ్రత్ సుజాతలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా  నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ రావు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.