జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్
ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి): వర్షాకాలంలో వచ్చే రోగాలు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేంద్ర అన్నారు మంగళవారం నాడు ఉట్నూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవం పెంచాలని ఈ సందర్భంగా అయన సూచించారు.ఎస్ఎన్ సి కేంద్రాన్ని సందర్శించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తావన తక్కువగా ఉన్నాయని వాటిని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.ప్రసూతి తేదీ దగ్గర పడుతున్న వెంటనే వారం రోజుల ముందు గర్భిణీ తీసుకువచ్చి ఆస్పత్రుల్లో ఉంచాలని ఈ సందర్భంగా తెలిపారు .వర్షాకాలం ప్రారంభమైందని ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాధుల బారిన పడిన వెంటనే వైద్య చికిత్స అందించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్. అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి సూపర్-ఇండెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.