ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచండి



  • సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి



  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బవేశ్ మిశ్ర 


  ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బవేశ్ మిశ్ర అన్నారు. .మంగళవారం నాడు అధికారులకు, ఏజెన్సీ వైద్య అధికారులకు సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ప్రసవాల జరిగే విధంగా ముందస్తు జాగ్రత్తలు వహించాలన్నారు. అధికారులు వైద్య అధికారులతో సహా ప్రతి ఒక్కరు   టార్గెట్ తీసుకుందమని  ఈ సందర్భంగా సూచించారు. రెండు శాతం టార్గెట్  తీసుకున్నట్లయితే ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచవచ్చని పి ఓ తెలిపారు.ఆస్పత్రిలో ప్రసవాలు జరగకపోవడం వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, రక్తహీనత కారణంగా తల్లితో పాటు పుట్టిన బిడ్డకు రక్షణ కరువు అవుతుందన్నారు. ఆస్పత్రిలో ప్రసూతి  అయినట్లయితే తల్లి బిడ్డ క్షేమం గా ఉంటుందని పేర్కొన్నారు.వర్షాకాలం ప్రారంభమైందని ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాధుల బారిన పడిన వెంటనే వైద్య చికిత్స అందించాలి అన్నారు. ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు వద్ద తగినన్ని మందులు ఉంచాలని తెలిపారు ఇంటి పరిసర ప్రాంతాలు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు .అలాగే మురికి కాల్వలను శుభ్రం చేసుకుని గుంతలు ఉన్నచోట్ల నీటిని నిల్వ ఉండకుండా చూడాలన్నారు.వానకాలం అయినందున అధికారులు.. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.