- రక్తదానం చేసిన ప్రోగ్రాం అధికారులు
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ అన్నారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో రక్త దానం గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. మనిషికి రక్తం కొన్ని రకాల ప్రమాదాలు జరిగినప్పుడు, వివిధ రకాల వ్యాధుల వలన రక్తం అవసరం అవుతుందన్నారు .అలాగే కొన్ని రకాల ఆపరేషన్లకు రక్తం అవసరం అవుతుందన్నారు , ఈలాంటి సమయంలో రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చే దాతలు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండాలని ,18 నుంచి 60 ఏళ్ల మధ్య స్త్రీ పురుషులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు అన్నారు. అలాగే 45 కిలోల బరువు ఉండి,సాధారణ స్థాయిలో బిపి ఉండి ఏడాది వ్యవధిలో మూడు నుంచి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు రక్తదానం చేయడానికి 12 గంటల ముందు తర్వాత ఆల్కహాల్ తీసుకోకూడదు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మనోహర్. డి ఎస్ ఓ డాక్టర్ వై సి శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ ,జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ ఆనంద్, జిల్లా అధికారి డాక్టర్ క్రాంతి జిల్లా టీబి అండ్ లెప్రసీ అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
రక్తదానం చేసిన ప్రోగ్రాం అధికారులు
రక్తదాన శిబిరాన్ని జిల్లా వైద్య అధికారి సమావేశమందిరంలో నిర్వహించారు జిల్లాలో మొట్టమొదటిసారిగా నలుగురు ప్రోగ్రామ్స్ అధికారులు ఒకే సారి రక్త దానం చేయడం మొదటిసారి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ ,జిల్లా అధికారి డాక్టర్ క్రాంతి, జిల్లా టీవీ మరియు లెప్రసి అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేశారు.