ఉస్మానియా దవాఖానకు కార్పొరేట్‌ సంస్థల చేయూత

సుల్తాన్‌బజార్‌(ఆరోగ్యజ్యోతి): పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖాన అభివృద్ధిలో  కార్పొరేట్‌ సంస్థల తోడ్పాటు ఎంతగానో ఉంది.  సోషల్‌ రెస్పాన్సిబిలిటీతో  కార్పొరేట్‌ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు  ఈ ఏడాది జూన్‌  వరకు రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను  అందించి  మానవత్వాన్ని చాటుకున్నారు.  గతేడాది రూ. 2 కోట్ల  విలువ చేసే సామగ్రిని అందజేస్తే   కరోనా నేపథ్యంలో ఆరు నెలల్లోనే  ఆస్థాయిలోనే  వైద్య పరికరాలను అందజేయడం అభినందనీయం. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌, సేవా భారతి, సఫా బైతుల్‌  మాల్‌ సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, తదితర సంస్థలు    వైద్య పరికరాలను విరాళంగా అందజేశాయి.  విరాళాలతో రోగి సహాయకులకు షెడ్ల నిర్మాణాలు, వసతులను కల్పించామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ పేర్కొన్నారు.