వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లకుండా ఇక్కడే చికిత్స

 


మహబూబ్‌నగర్‌ (ఆరోగ్యజ్యోతి): రాబోయే రోజుల్లో ఎవరూ వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు వెళ్లకుండా పాలమూరులోనే అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో నూతనంగా నర్సింగ్‌ పోస్టులకు ఎంపికైన 160 మం ది నర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాలను కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవ అదృష్టంగా భావించాలన్నారు.సేవ చేసే గొప్ప అవకాశం మీకు లభించిందని, సమయ పాలన పాటించి బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. 2014లో జిల్లా దవాఖానలో కేవలం 18 మంది డాక్టర్లు పనిచేసే వారని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పాలమూరుకు మెడికల్‌ కళాశాల కావాలని సీఎం కేసీఆర్‌ను అడిగి మంజూరు చేయించానని గుర్తు చేశారు. ప్రస్తుతం వైద్య సేవలు అందించేందుకు 200 మంది డాక్టర్లను తీసుకున్నామని తెలిపారు. గతంలో 70 మంది నర్సులు ఉండగా ప్రస్తుతం 470 మంది ఉన్నారని, వీరితోపాటు 300 మంది ల్యాబ్‌ టెక్నీషియన్‌, పారిశుధ్య కార్మికులు, వివిధ విభాగాల వారిని నియమించినట్లు చెప్పా రు. అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు రూ.కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.కార్యక్రమాల్లో ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్‌, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో కృష్ణ, దవాఖాన సూపరింటెండెం ట్‌ రాంకిషన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, కమిషనర్‌ సురేందర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు జీవన్‌, నర్సింహులు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు యాద మ్మ, దవాఖాన కమిటీ సభ్యులు వెంక న్న, మల్లేశం, లక్ష్మి, మాల్లారెడ్డి ఔట్‌సోర్సింగ్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.