హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం 879 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 713 కేసులు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 9553 పాజిటివ్ కేసులు నమోదవగా, ఇవాళ వైరస్‌తో మరో ముగ్గురు మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 220కి చేరింది. ఇప్పటి వరకు 4224 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, 5109 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీలో 652 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 112 , రంగారెడ్డిలో 64, వరంగల్ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగామలో 7, నాగర్ కర్నూల్‌లో 4, సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో రెండు చొప్పున, మెదక్‌లో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.