హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 458 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19తో నేడు ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. వ్యాధి నుంచి కోలుకుని నేడు 154 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 203 మంది మరణించారు. నేడు కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు 7,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,363గా ఉంది. కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో 3,506 మంది డిశ్చార్జ్ అయ్యారు.