హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6526కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 198 మంది మృతి చెందారు. 2976 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 3352 మంది డిశ్చార్జయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 329 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం పాజిటివ్ కేసులు 4526కు చేరాయి. మరోవైపు గచ్చిబౌలిలో ఒకే రోజు 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా కరోనాపాజిటివ్‌గా నిర్దారణ అయింది. 99 మందికి పరీక్షలు చేయగా 33 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మరో 15 మంది పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు.