వర్షాకాల వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి


  • 70 వేల దోమతెరలు పంపిణీకి  సిద్దం 

  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బవేశ్ మిశ్ర 


  ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి):  వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పై జాగ్రత్తగా ఉండాలని  గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బవేశ్ మిశ్ర అన్నారు సోమవారం నాడు హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కామాయి పెట్  గ్రామంలో దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వల్ల మలేరియా, సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దోమతెరలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ దోమ తెరలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలం వ్యాధులు సంభవించకుండ  ఉండేందుకు ఇంటి పరిసర ప్రాంతాలు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు .అలాగే మురికి కాల్వలను శుభ్రం చేసుకుని గుంతలు ఉన్నచోట్ల నీటిని నిల్వ ఉండకుండా చూడాలన్నారు.ఇప్పటికే ఐటీడీఏ పరిధిలోని గ్రామాలను గుర్తించి, పంపిణీ చేసేందుకు 70,500 దోమతెరలు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. వానకాలం అయినందున అధికారులు.. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలోఅడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ , ఎఎంఓ  వెంకటేష్ , గోకుల్ కన్సల్టెంట్ సభన ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్త,లు పంచాయతీ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.