హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో గురువారం భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా .. వైరస్ తో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 6,027కి చేరగా..2,531 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. గురువారం 230 మంది డిశ్చార్జ్ కాగా..మొత్తం 3, 301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా 195 మంది చనిపోయారు.ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే ఫస్ట్ టైం కాగా.. కొత్తగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. రంగారెడ్డిలో 17, మేడ్చల్‌లో 10, మంచిర్యాలలో 4, జనగామలో 3, వరంగల్ అర్బన్ లో 3, భూపాలపల్లిలో 2, మహబూబ్ నగర్ లో 2, మెదక్‌లో 2, నిజామాబాద్ లో 2, సంగారెడ్డిలో 2, వరంగల్ రూరల్, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది.