32 మంది వైద్య సిబ్బందికి కరోనా

హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సోమవారం జరిపిన పరీక్షల్లో పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో 32 మంది వైద్య సిబ్బందికి వైరస్‌ పాజిటివ్ ‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. వారిలో 18 మంది డాక్ట‌ర్లు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రులతో పాటు, నిమ్స్‌, కింగ్‌ కోఠి, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి జాగ్రత్తలు, పీపీఈ కిట్లు ధరించినప్పటికీ వైద్య సిబ్బందికి కరోనా సోకవడం ఆందోళన కలిగిస్తోంది.