వాషింగ్టన్: రెమ్డెసివిర్ మందు కరోనాపై బాగా పనిచేస్తున్నట్టు తేలింది. జస్ట్ మూడు రోజుల్లోనే కరోనాను ఆ మందు చంపేసింది. దాని ఆనవాళ్లు లేకుండా చేసింది. మకాక్స్ అనే జాతి కోతులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు చెందిన సైంటిస్టులు మందును ప్రయోగించి ఈ నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే మనుషులపైనా ఆ మందును పరీక్షిస్తామని చెప్పారు. కోతులను రెండు బ్యాచ్‌లుగా విడదీసి, కరోనా వైరస్‌ను ఎక్కించారు. ఒక బ్యాచ్‌లోని కోతులకు లంగ్స్‌లో వైరస్ సంఖ్య పెరిగిన 12 గంటల తర్వాత రెమ్డెసివిర్ మందును ఇచ్చారు. ఆరు రోజుల పాటు రోజుకో డోసు చొప్పున ఆ మందును వేశారు.