తెలంగాణలో ఇవాళ 269 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి)‌: తెలంగాణలో బుధవారం కొత్తగా 269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,675కి చేరింది. హైదరాబాద్‌ పరిధిలో 214 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 192కు పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,412 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు 151 మంది కోలుకున్నారు.  ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 3,071 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జనగామ(5),భూపాలపల్లి(1), కరీంనగర్‌(8), ఆసిఫాబాద్‌(1), మహబూబ్‌నగర్‌(1), మెదక్‌(3) జిల్లాలో బుధవారం కేసులు నమోదయ్యాయి.