హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 219 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 189 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు.ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5193.. కాగా, మృతుల సంఖ్య 187