వరంగల్,(ఆరోగ్యజ్యోతి): నిర్మల మహిళా సంఘం ఆధ్వర్యంలో రూ॥ 20 లకె.భోజనం క్యాంటీన్ వరంగల్ అర్బన్ జిల్లాలో జెమినీ టాకీస్ ఎదురుగా నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు,వద్దిరాజు గణేష్ ప్రారంభించడం జరిగింది. నిర్మల మహిళా సంఘం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ భోజన కార్యక్రమన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా క్యాంటీన్ ను వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్ ఎంజీఎం మార్చురీ ఎదురుగా జెమిని థియేటర్ ముందు పేద ప్రజలకు అందుబాటులో ఇరవై రూపాయలకే భోజనం అనే పథకాన్ని అందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో.SK.ప్రసన్న, కారంపూరి నిర్మల, మహేష్, బంగారు అరుణ, గోపి ,LC బైరపాక శ్రీనివాస్, రోహిణి .దేవులపల్లి మోహన్, మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది.