హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): తెలంగాణలో కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ కెపాసిటీ పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌లోనూ పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో టెస్టులకు రూ.2,200కు మించి చార్జ్ చేయకూడదని ఆదేశించారు. కరోనా టెస్టులు, పాజిటివ్ వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్ లో నమోదు చేయాలన్నారు మంత్రి ఈటల.
9 ప్రభుత్వ.. 18 ప్రైవేటు ల్యాబ్స్
తెలంగాణలో ఇప్పటి వరకు 9 ప్రభుత్వ ల్యాబ్స్‌లో మాత్రమే కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌లోని నిమ్స్, సీసీఎంబీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, సర్ రొనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికముబుల్ డిసీజెస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీల్లో కరోనా ఆర్టీ-పీసీఆర్ ల్యాబ్స్ ఉన్నాయి. అయితే తెలంగాణలో మొత్తం 18 ప్రైవేటు ల్యాబ్స్‌కు భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్), నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) ఆమోదం పొందాయి. అయితే సిద్దిపేటలో మరో ల్యాబ్ (ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్) అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా ఎన్ఏబీఎల్ పర్మిషన్ పెండింగ్‌లో ఉందని ఐసీఎంఆర్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
18 ప్రైవేట్ ల్యాబ్స్ లిస్ట్:
– హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆపోలో హాస్పిటల్
– హైదరాబాద్ హిమయత్ నగర్‌లోని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్
– హైదరాబాద్ ఐడీఏ చర్లపల్లిలోని వింతా ల్యాబ్
– సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్
– హైదరాబాద్ పంజాగుట్టలోని డాక్టర్ రెమిడీస్ ల్యాబ్
– హైదరాబాద్ మేడ్చల్‌లోని ప్యాథ్‌కేర ల్యాబ్
– హైదరాబాద్ శేర్లింగంపల్లిలోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్
– సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని మెడిక్స్ ప్యాథ్‌ల్యాబ్స్
– సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్
– మేడ్చల్‌లోని బయోగ్నోసిస్ టెక్నాలజీస్ ల్యాబ్
– బంజారాహిల్స్‌లోని టెనెట్ డయాగ్నోస్టిక్స్
– గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్
– బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్
– సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్
– మాదాపూర్‌లోని మ్యాప్ మై జినోమ్ ల్యాబ్
– చర్లపల్లిలోని లెప్రా సొసైటీ – బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్
– సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్
– బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్